మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Dharma Sastha Ashtakam 1 – శ్రీ ధర్మశాస్తాష్టకం


బంధూకబంధురరుచిం కలధౌతభాసం
పంచాననం దురితవంచనధీరమీశమ్ |
పార్శ్వద్వయాకలితశక్తికటాక్షచారుం
నీలోత్పలార్చితతనుం ప్రణతోఽస్మి దేవమ్ || 1 ||

కల్యాణవేషరుచిరం కరుణానిధానం
కందర్పకోటిసదృశం కమనీయభాసమ్ |
కాంతాద్వయాకలితపార్శ్వమఘారిమాద్యం
శాస్తారమేవ సతతం ప్రణతోఽస్మి నిత్యమ్ || 2 ||

యో వా స్మరేదరుణకుంకుమపంకశోణ-
-గుంజాపినద్ధకచభారలసత్కిరీటమ్ |
శాస్తారమేవ సతతం స తు సర్వలోకాన్
విస్మాపయేన్నిజవిలోకనతో నితాంతమ్ || 3 ||

పంచేషుకైటభవిరోధితనూభవం తం
ఆరూఢదంతిపరమాదృతమందహాసమ్ |
హస్తాంబుజైరవిరతం నిజభక్తహంసే-
-ష్వృద్ధిం పరాం హి దదతం భువనైకవంద్యమ్ || 4 ||

గుంజామణిస్రగుపలక్షితకేశహస్తం
కస్తూరికాతిలకమోహనసర్వలోకమ్ |
పంచాననాంబుజలసత్ ఘనకర్ణపాశం
శాస్తారమంబురుహలోచనమీశమీడే || 5 ||

పంచాననం దశభుజం ధృతహేతిదండం
ధారావతాదపి చ రూష్ణికమాలికాభిః |
ఇచ్ఛానురూపఫలదోఽస్మ్యహమేవ భక్తే-
-ష్విత్థం ప్రతీతవిభవం భగవంతమీడే || 6 ||

స్మేరాననాద్భగవతః స్మరశాసనాచ్చ
మాయాగృహీతమహిలావపుషో హరేశ్చ |
యః సంగమే సముదభూత్ జగతీహ తాదృగ్
దేవం నతోఽస్మి కరుణాలయమాశ్రయేఽహమ్ || 7 ||

యస్యైవ భక్తజనమత్ర గృణంతి లోకే
కిం వా మయః కిమథవా సురవర్ధకిర్వా |
వేధాః కిమేష నను శంబర ఏష వా కిం
ఇత్యేవ తం శరణమాశుతరం వ్రజామి || 8 ||

ఇతి శ్రీ ధర్మశాస్తాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.